నల్గొండ జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
నల్గొండ జిల్లా గుర్రంపోడు ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉట్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అఖిమ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి