మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని చెరువు ముందు సింగారంలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3,490 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషయాలపై సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతాం. ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి