కాకినాడ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
కాకినాడలో స్కూటీపై వెళ్తూ కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి, లారీ ముందు పడ్డ నరేందర్ అనే వ్యక్తి
అదృష్టవశాత్తు టైర్ల మద్యలో పడడంతో ప్రాణాలతో బయటపడ్డ నరేందర్
నరేంద్ర అనే వ్యక్తి తన బైక్ తీసుకొని కాకినాడలో రోడ్ పై వెళ్తున్నాడు ముందు కాంక్రీట్ లారీ వెళ్తుంది. దాన్ని క్రాస్ చేద్దామనుకున్నాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేశాడు.
ప్రమాదవశాత్తు లారీ ఏడవ వైపు ముందు ప్రాంతంలో బైక్ తగిలి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు లారీ రెండు టైర్ల మధ్యలో పడడంతో... నరేందర్ మీద నుంచి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం నరేందర్ కి ఏమీ అర్థం కాలేదు. కళ్ళు తెరిచేసరికి లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారు అతనికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయని, అదృష్టం అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.

