పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు వారందరికీ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఈ చేరికతో గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలం మరింతగా పెరిగిందని రేగా కాంతారావు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి దిశగా కృషి చేసే పార్టీగా బిఆర్ఎస్ నిలుస్తుందని ఆయన అన్నారు.
గ్రామ ప్రజలు రేగా కాంతారావు నాయకత్వంపై విశ్వాసం ఉంచి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం ఆనందకరమని స్థానిక నేతలు తెలిపారు.
.jpg)
కామెంట్‌ను పోస్ట్ చేయండి