డ్రైవర్లు & శ్రామిక పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఐటిడిఏ పిఓ రాహుల్

 


భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ హైదరాబాద్ వారు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పని చేయుటకు డ్రైవర్లు (1000) మరియు శ్రామిక (743) పోస్టుల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసినందున ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.


       దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నారు. అభ్యర్థుల వయస్సు డ్రైవర్లకి 22 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు, శ్రామిక్ పోస్టులకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని, దరఖాస్తు పీజు డ్రైవర్స్ కి రూ. 300/-శ్రామిక్ కి రూ.200/-చెల్లించాలని, దరఖాస్తులు అక్టోబర్ 8 నుండి 28వ తారీకు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అన్నారు. 


       కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో అర్హత, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.tgprb.in వెబ్ సైట్ ని సంప్రదించాలని ఆయన కోరారు.

Post a Comment

కొత్తది పాతది