ఇంటర్‌ పాసైన వారికి కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే...

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


న్యూఢిల్లీ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. కానిస్టేబుల్ (డ్రైవర్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 737 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంటే మహిళలకు దరఖాస్తు చేసువడానికి అవకాశం లేదన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 15, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..




కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టెన్‌+2 లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హెవీ మోటర్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన పురుష అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, షార్ట్‌ లిస్టింగ్‌, ధృవీకరణ పత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 15, 2025.

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్‌ 16, 2025.

దరఖాస్తు సవరణ తేదీ: అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు

రాత పరీక్ష తేదీ: 2025 డిసెంబర్‌ లేదా జనవరి 2026 నిర్వహించే అవకాశం ఉంది.

Post a Comment

కొత్తది పాతది