పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు మంగళవారం ఏఎస్ఐ మన్సూర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పండగ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో డిస్కౌంట్ తో కూడిన ఆఫర్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మభ్య పెడతారని తెలిపారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపిలు అడిగితే చెప్పకూడదన్నారు. మొబైల్ ఫోన్లో తెలియని లింకులను ఓపెన్ చేయకూడదని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనందున సైబర్ నేరాలు కూడా ఎక్కువ అయ్యాయి అన్నారు. ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారని తెలిపారు. ఎవరైనా సాగర్ నేరాల బారిన పడితే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలన్నారు. ఆన్లైన్ గేమ్ల వంటి బెట్టింగ్ జోలికి కూడా వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి