పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, ప్రతినిధి :
మిషన్ భగీరథ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలోని గ్రామీణ , పట్టణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడం. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ పినపాక మండలం ఉప్పాక గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ లో గేటు వాల్ కు మూత లేక చెత్తాచెదారంతో పేరుకుపోయి మురికి పట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో నుంచే మంచినీరు సరఫరా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఫలితం లేదని చెప్తున్నారు. ఆ నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి గేేేట్ వాల్ ను శుభ్రం చేపించాలని కోరుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి