పినపాక యువకుడికి అండగా నిలిచిన కుంజ సూర్యరామ్

 



జాతీయ స్థాయి పోటీలకు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందచేత.


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక: కడు పేదరికంలో ఉన్నప్పటికీ క్రీడల్లో రాణిస్తూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలానికి చెందిన ఆదివాసీ యువకుడు దబ్బగట్ల లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్యరామ్ అండగా నిలిచారు. పాండిచ్చేరిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు హాజరు కావడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోకేష్‌కి సూర్యరామ్ ₹10,000 ఆర్థిక సాయం అందించినారు.

కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న లోకేష్ అండర్-14 విభాగంలో తన సత్తా చాటాడు. హనుమకొండ, జార్ఖండ్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కానీ, పేదరికం కారణంగా జాతీయస్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలన్న తన కల ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మంత్రి సీతక్క తనయుడు కుంజ సూర్యరామ్ వెంటనే స్పందించి లోకేష్‌కి ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని సూర్యరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లోకేష్‌ను ఇతర క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని, జాతీయ స్థాయిలో విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. సకాలంలో సాయం అందించిన సూర్యరామ్‌కు లోకేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయంతో లోకేష్ ఇప్పుడు ధైర్యంగా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం,సూర్యన్న టీం సభ్యులు పినపాక పట్టి నగర్ సతీష్, భాను,పొనుగోటి చందర్రావు, అచ్చా నవీన్, జరుపుల రాము నాయక్, కోడిరెక్కల సాయి కుమార్, కల్తీ ప్రభాకర్, అత్తె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది