పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు సోమవారం ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహన ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించను వారికి చలానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి