ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి.



సంగారెడ్డి జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్


 పట్లోళ్ల నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా


  "వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్‌ను ఏర్పాటు చేయడానికి మరియు ఫిర్యాదుదారుడి ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్‌ను కేటాయించడానికి అనుమతి ఇచ్చినందుకు" ఫిర్యాదుదారుడి నుండి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.







తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది.


 మంత్రుల వరుస ప్రకటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.


 క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులు, ఆశావహులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. 


సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలుపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.


 జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయాని.. ఆ తర్వాత సర్పంచ్ (గ్రామ పంచాయతీ), మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 


ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితా తయారీ పనులను పూర్తి చేసిందన్నారు. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను కూడా సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోందని చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. గత ఏడాదే ఎన్నికలు నిర్వహించాలనుకున్నా వాయిదా పడుతూ వస్తున్నాయి. 


ఈ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో తమ పట్టును బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 


ఇటీవల అమలు చేసిన రైతు భరోసా, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను తమ బలాన్ని తిరిగి నిరూపించుకునే అవకాశంగా చూస్తోంది. 


గ్రామస్థాయిలో తమ కార్యకర్తలను, నాయకులను క్రియాశీలం చేసేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. 


బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల విజయం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.


 మంత్రుల ప్రకటనల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. 


అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీకి సిద్దమవుతున్నారు. 


గ్రామాల్లో పాగా వేసి ఓటరు దేవుళ్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.






మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా...



🔥 మణుగూరు మండలంసమితి సింగారం గ్రామపంచాయతీ వాగు మల్లారం ప్రాంతానికి చెందిన

🔥 చెన్నబోయిన నరసయ్య 60 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించాడు వీరిది అతినిరుపేద కుటుంబం

🔥ఈ విషయం తెలిసి స్పందించిన మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నర్సయ్య కుటుంబ సభ్యులకు 3000/- రూపాయలు దహన సంస్కరాల కోసం అందచెయ్యడం జరిగింది..

🔥ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు.. ఉపాధ్యక్షులు మంగి మల్లికార్జున్ యాదవ్.. అంబులెన్స్ డ్రైవర్ ప్రదీప్.. ట్రస్ట్ సభ్యులు P జగన్ మోహన్.. అమూల్ శ్రీను.. డేరంగుల నరసింహ..

గ్రామ పెద్దలు మేకల లింగయ్య.. అందే సత్యనారాయణ.. తదితరులు పాల్గొన్నారు.


Aslo Read...

ఫీజుల దోపిడిని అరికట్టండి 



విద్యార్థులకు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి 


నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలి..


జిల్లా ఉన్నత అధికారులకు సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి వినతి


మణుగూరు : ఏజెన్సీ ఏరియాలోని మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి డిమాండ్‌ చేశారు . సోమవారం ఈమెరకు ఆయన జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని మణుగూరు పట్టణంతోపాటు సబ్ డివిజన్ లో విద్యాహ క్కు చట్టం పాటించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కార్పొరేట్‌, ప్రైవేటు వద్యాసంస్థలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఫీజు వివరాలను నోటిసు బోర్డులో అతికించి అందరికీ తెలియజేసే విధంగా ఉండాల్సి ఉండగా ఏ ఒక్క పాఠశాలో కూడా పాటించ

డంలేదన్నారు. అలాగే గుర్తింపు లేని ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాల

లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యను వ్యాపారమయం చేశా

రన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘంచి విద్యా చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టా

రాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ లాభార్జనే తమ ధ్యేయంగా ప్రైవేట్ విద్యావ్యవస్థ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకా

లు, దుస్తులు కూడా విద్యాసంస్థ

ల్లో పెట్టి వ్యాపారం కొనసాగిస్తుంటే విద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుర్తింపులేని ప్రైవేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

.అలాగే భీనామీ పేర్లతో మెడికల్

 షాపును నిర్వహిస్తున్న యజమా

నులు సదరు దుకాణంలో మందు

లను విక్రయించడంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలకు చెందిన నోట్ పుస్తకాలు, పాఠ్యపు

స్తకాలను విక్రయిస్తూ దోపిడీకి తెర లేపారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్కు 

 ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే ఆ దుకాణం లైసెన్స్ ను 

ప్రిజ్ చేయాలన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల దోపిడీపై తక్షణమే చర్యలను కోరుతూ      

జిల్లా కలెక్టర్, ఐ.టి.డి.ఏ. ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి,పోలిస్ స్టేషన్ SHO,

జిల్లా సేల్స్ ట్యాక్స్ అధికారి, కమర్షియల్స్ ట్యాక్స్ అధికారి ని 

స్వయంగా కలసి పిర్యాదు చేసామని రవి పేర్కొన్నారు.

కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ల పేరుతో దోపిడీకి గురి చేస్తున్నాయన్నారు. అనేకసార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పాఠ్య పుస్తకాలు యూనిఫారం వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలను సీజ్‌ చేయాలని తెలిపారు. కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలలు అర్హత పరీక్ష పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తూ వ్యాపారం ముసుగులో యూనిఫామ్‌, పాఠ్య

పుస్తకాలు వేలాది రూపాయలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారని అన్నారు. పలు కార్పొరేట్‌ ప్రయివేట్‌ పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నా పట్టించుకోలేదని మండి పడ్డారు. ఇప్పటి కైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నత అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఫీజులను నియంత్రించాలని, ఈ మేరకు ఆయా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని లేకపోతే మరింత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Post a Comment

కొత్తది పాతది