భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

 




 

 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోటి గూడెం పంచాయతీ బోటి గూడెం గ్రామం నందు భూభారతి గ్రామ రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన *MLA పాయం* గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలుపరుస్తుందని గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో ఎన్నో అవకతవకలు జరిగాయని, రైతులు చాలా నష్టపోయారని ఎందరో రైతులు ఇబ్బందులు పాలయ్యారని, భూభారతి చట్టం రైతులందరికీ చాలా మేలు కలిగిస్తుందని సులువుగా అర్థమవుతుందని భూమి యొక్క వివరాలను దరఖాస్తు రూపంలో గ్రామ రెవిన్యూ శాఖ అధికారులకు అందజేసి మీ యొక్క భూమి వివరాలను నమోదు చేసుకోగలరని, భూభారతి చట్టం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు హాజరు కాలేని రైతులు నేరుగా తాసిల్దార్ గారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రైతులు దరఖాస్తు చేసుకుని సంతోషం వ్యక్తపరిచారు. 


ఈ యొక్క కార్యక్రమంలో MRO గోపాలకృష్ణ గారు, గోడిశాల రామనాథం గారు, మండల నాయకులు, గ్రామస్తులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది