ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ లో జరుగు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మికులను కోరారు. శుక్రవారం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించి, సింగరేణిలోని వివిధ విభాగాలలో కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి, కార్మికుల పక్షాన నిలబడినటువంటి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించి రాష్ట్రంలోని కార్మికుల అనేక సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. సింగరేణి, కేజీబీవీ, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, ఆటో అండ్ మోటార్ వర్కర్స్, హోటల్స్, బీడీ వర్కర్స్, హమాలీ, మధ్యాహ్న భోజన వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, విద్యుత్, హాస్పటల్స్ తదితర అనేక రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ, వారి హక్కుల కోసం ఉద్యమిస్తుందన్నారు. ఈ సందర్భంలోనే గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొనుటకు జూన్ 21 భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ 22 ప్రతినిధుల సభ నిజామాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలకు టి యు సి ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు అమ్రిష్ పటేల్ హాజరవుతారని జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడానికి పూనుకున్నదని, దానిలో భాగంగానే మందు తరాల కార్మిక వర్గం పోరాడి, రక్త తర్పణ చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి 8 గంటల పని దినం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లాంటి తదితర అనేక హక్కులను కాలరాసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి పూనుకున్నది అన్నారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టవలసిన బాధ్యత నేటి కార్మికవర్గంపై ఉందన్నారు. కార్మికుల హక్కుల రక్షణకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి, బలమైన కార్మికోద్యమ నిర్మాణానికి మహాసభలో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని ఈ మహాసభలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వి. జానయ్య, కార్మికులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి