మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అధిక ధరలను వసూళ్లు చేస్తున్న బుక్ స్టాల్స్ ఫై చర్యలు చేపట్టాలి
*జీఎస్టీ బిల్లులు ఇవ్వని ఆ బుక్ స్టాల్స్ పై కమర్షియల్*
*అధికారులు దృష్టి సారించాలి*
*పేరులోనే మెడికల్ షాప్... అమ్మేది మాత్రం నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు..*
*ఔషధ నియంత్రణ అధికారుల రా.. ఇటు చూడరా...*
*సామాజిక కార్యకర్త,న్యాయవాది కర్నె రవి*
మణుగూరు విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రతి సంవత్స
రం లాగానే సబ్ డివిజన్ లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యా
లు పుస్తకాలు, ఫీజులు, యూని
ఫాంల పేరుతో తల్లిదండ్రులను అడ్డంగా దోపిడీ చేస్తున్నారని, వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి గుంజుతున్నారని,
సామాజిక కార్యకర్త,న్యాయవాది కర్నె రవి అందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూలేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొందరు బుక్ స్టాల్స్ యజమానులతో కు మ్మక్కై దోపిడీ చేస్తున్నారని, వీరిపై తక్షణమే చర్యలు చేపట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన మండల తహసిల్దార్ అద్దంకి నరేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ.. పట్టణంలో ఔషధ దుకాణం పేరుతో లైసెన్స్ పొందిన ఆ యజమానులు ఔషధాలను విక్రయిస్తూనే, మరోవైపు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు విక్రయిస్తున్నారని, మండిపడ్డారు . ఔషధ దుకాణంలో పాఠ్యపుస్తకాలను ఎలా విక్రయిస్తారో ఔషధ నియంత్రణ అధికారులు సమాధానం చెప్పాలనినిలదీశారు
. ఒక్కో విద్యార్థి నుంచి తరగతులను బట్టి రూ.3వేల నుంచి రూ.4వేలు వరకు పుస్తకాల కోసం, యూనిఫాంకు రూ.5 నుంచి రూ.6 వేలు వసూళ్లు చేస్తున్నారని, తీరా తల్లిదండ్రులు బిల్ అడిగితే కాలి పేపర్ పై రాసి ఇస్తూ ఏజెన్సీ ప్రజలను నిలువునా దోసుకుంటు
న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లును మాత్రం ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతి దుకాణ యజమాని జిఎస్టి బిల్లుతో వ్యాపారం చేస్తూ జీరో దందాకుతెర లేపుతున్నారని, దీనిపై తక్షణమే కమర్షియల్ టాక్స్ అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడిని, బుక్ స్టాల్ యజమానుల ధన దహార్తినికి తహసిల్దార్ స్పందించి అడ్డు కట్ట వేయాలని ఆయన కోరారు. విద్యార్ధుల తల్లి తండ్రుల బలహీనలతను ఆసరాగా తీసుకోని ప్రై వేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని, వీరిపై జిల్లా విద్యాశాఖ అధికారి, కమర్షియల్ టాక్స్ ఉన్నత అధికారులకు, ఆదాయపన్ను శాఖ అధికారుల
కు,జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతామని రవి పేర్కొన్నారు. అలాగే పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న ఔషధ దుకాణం లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా
డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించిన దుకాణాలపై చర్యలు చేపట్టాలని కోరారు. మరి వైపు నిబంధనలు పాటించకుండా వ్యాపారాలుచేస్తూవినియోగదారులకు జీఎస్టీ బిల్లులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్న దుకాణాలఫై బుక్ స్టాల్స్ పై కమర్షియల్ అధికారులు దృష్టి సారించాలని లేనిచో ఆ శాఖ ఉన్నత అధికారులకు పిర్యాదు చేస్తామని రవి పేర్కొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి