ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇక చెక్ పెట్టాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ACB DSP రమేష్ తెలిపారు.
పోలీస్, రెవిన్యూ, ఫారెస్ట్, విద్యుత్ తదితర శాఖల్లో వివిధ పనులు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే *08742-228663* , *9440446146* కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా ప్రియాంక బాధ్యతలు స్వీకరణ
ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీ గా బదిలీ చేసి *మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గా ఉన్న సిహెచ్ ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నిన్న ఉదయం సచివాలయంలో హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గా భాద్యతలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి