ప్రమాదకరంగా కల్వర్టు.. పట్టించుకోని అధికారులు


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


రహదారి లో ప్రమాదం పొంచి ఉంది రోడ్డు పై ఉన్న కాల్వర్టు కుంగి పోయింది. సైడ్ ప్రమాదకరంగా మారి ప్రయాణనికి ఇబ్బందికరంగా మారుతుంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్డు పై అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా పెట్టకపోవడం తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏదైనా ప్రమాదం జరిగితే కానీ అధికారులు మొద్దు నిద్ర వీడేలా లేరు.

పినపాక, కరకగూడెం మండలాల సరిహద్దు ప్రాంతం లో పోయిన సంవత్సరంలోకురిసిన వర్షాలకు కోడిపుంజుల వాగు పై నిర్మించిన కాల్వర్టు సగం కూలిపోయింది.కూలిన కాల్వర్టు కింద భాగం లో 10 అడుగుల లోతు కోడిపుంజుల వాగు ఉంటుంది. ప్రమాదవశాత్తు వాహనాలు కాల్వర్టు లో పడిపోతే అంతే సంగతి.ఇప్పటికైనా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించి సత్వరమే కల్వర్టు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం లో ఈ కల్వర్టు మిగిలిన భాగం కూలిపోయే ప్రమాదం ఉంది.



 బంగారు గూడెం గ్రామస్తుల మాటల్లో...

బంగారు గుండెనికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ బంగారు గూడెం గ్రామం కరకగూడెం, పినపాక మండలాల సరిహద్దు ప్రాంతం మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే వర్షాకాలం లో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మారమ్మతులు చేయాలనీ లేదా నూతన కాల్వర్టు నిర్మించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Post a Comment

కొత్తది పాతది