పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గణేశ్ నవరాత్రి వేడుకలు సందర్భంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని రక్షించాలని, పినపాక ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్వి అన్నారు. గణపతి నవరాత్రులు సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ పరిధిలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో తేజస్వీని మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపి) విగ్రహాలు నీటి వనరులను తీవ్రంగా కాలుష్యం చేస్తుండగా, వాటి రసాయనాలు జలజీవులను నాశనం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా నీటి వనరులు కాపాడటమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు తెలిపారు. గణపతి విగ్రహాలను సహజ మట్టితో తయారు చేసి, పండుగ అనంతరం గృహంలో గానీ, తోటల్లో గానీ నిమజ్జనం చేయవచ్చు అని తెలిపారు. ఇలా చేయడం ద్వారా ప్రకృతి సమతుల్యం నిలబెట్టవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోలు వెంకటేశ్వర్లు, అరుణ, ఎఫ్ఎస్వో వెంకటమ్మ, బీట్ ఆఫీసర్ లు రాణి, శశిరేఖ, ఆదిత్య, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి