భయంకరంగా మారిన ఆ రెండు జిల్లాల పరిస్థితులు.... భారీగా వర్షపాతం నమోదు

 


TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం తీవ్ర విపత్తుగా మారింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మిల్లీమీటర్లు కురిసింది. 


అంటే కేవలం 14 గంటల్లోనే 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షం కాదని.. విపత్తు స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు.


ఇంకా 3-4 గంటల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 12 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో మొత్తం వర్షపాతం 550-600 మిల్లీమీటర్ల దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


ఈ వరదలు 2023లో భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న చిత్యాల 600 మిల్లీమీటర్ల రికార్డును గుర్తు చేస్తున్నాయి. ఆ సమయంలోనూ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడీ కామారెడ్డిలోని పరిస్థితి కూడా అలాంటి భయానక వాతావరణాన్ని తలపిస్తోంది.

Post a Comment

కొత్తది పాతది