ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సింగరేణి సహకారంతో మణుగూరు లో కూడా నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించాలి ఎమ్మెల్యే చొరవ చూపాలి.
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతి
మణుగూరులో సింగరేణి సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి జాబ్ మేళా నిర్వహించాలని దీనికై ఎమ్మెల్యే చొరవ చోపాలని కోరుతూ సోమవారం
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడారు .
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు నిరుద్యోగులకు ఉపాధి దొరికితే వారికి వారి కుటుంబానికి జీవితాంతం అన్నదానం చేసినట్లే ఈ కాన్సెప్ట్ తో సింగరేణి సి ఎం డి ఎం బలరాం (ఐఆర్ఎస్) గారు ప్రభుత్వ సహకారంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చొరవతో, ఆర్జీ- 1 జిఎం డి లలిత్ కుమార్ గారి ప్రత్యేక కృషితో సింగరేణి ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ గోదావరిఖనిలో వైరా ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు 24వ తేదీ ఖమ్మం జిల్లా వైరాలో నిరుద్యోగుల ఉపాధి కల్పనకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ రెండు కార్యక్రమాలు కూడా అందరి ప్రశంసలు అందుకున్నాయి.
ప్రత్యేకించి నిరుద్యోగులు ఎంతోమంది తమకు ఉపాధి దొరికినందుకు ఎంతగానో సంతోషించారు.
ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి చొరవతో మణుగూరులో కూడా సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు కూడా ఎంతోమంది సింగరేణి నిర్వాసితులకు స్థానికులకు సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపాధి దొరికినట్లు అవుతుందనీ ఉన్నత చదువులు చదువుకుని, వృత్తి నైపుణ్యత శిక్షణ పొంది ఉద్యోగాలు దొరకక నిరాశ నిస్పృహలతో ఉన్న నిరుద్యోగ యువతకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు మంగీలాల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పల శివ రామకృష్ణ, నాగేశ్వరరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి