పినపాక మండల వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షం

 




పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మండలం వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పలు ప్రాంతంలో పడ్డాయి. ఓవైపు విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది.  దాదాపు గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. వర్షానికి వాహనదారులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపేశారు. అయితే ఈ సంవత్సరం మే నెలలో ముందుగానే వర్షాలకు కురుస్తున్నాయని చెప్పాలి. రైతన్నలు పొలం దుక్కులు దున్నే పనిలో ఉన్నారని చెప్పాలి. మే నెల ఎండ వేడి ప్రభావం ఈసారి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


ఎక్కడపడితే అక్కడ పిడుగులు పడుతున్నందున వాహనదారులు వర్షం తగ్గాక ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం. 


ఇది కూడా చదవండి...

బ్రేకింగ్ న్యూస్: ఏసీబీ కి చిక్కిన మరో అధికారి

Post a Comment

కొత్తది పాతది