రాజీవ్ యువ వికాస్... బిగ్ అప్డేట్



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్


తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే పథకం అమలు కోసం సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తాజాగా సమావేశం నిర్వహించారు. 


ఈ నేపథ్యంలోనే జూన్‌ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాజీవ్‌ యువ వికాసం పథకంలో అర్హులుగా గుర్తించిన వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


 జూన్‌ 15వ తేదీ తర్వాత రాజీవ్‌ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్‌ ఉంటుందని భట్టి విక్రమార్క వెల్లడించారు. 


అక్టోబర్‌ 2వ తేదీ నాటికి 5 లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు.


 ఈ రాజీవ్ యువ వికాసం పథకం కోసం రూ. 6,250 కోట్లు ఆర్థిక సహాయంగా అందించనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.


ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మంత్రి సీతక్క వెల్లడించారు. 


లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయంలో 60 నుంచి 80 శాతం వరకు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. రూ.50 వేల రుణాలపై 100 శాతం రాయితీ అందించనుండగా.. రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలు పొందొచ్చు. 


నిరుద్యోగాన్ని తగ్గించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం కోసం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 


తెలంగాణ యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి.. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఇది కూడా చదవండి...భారీగా గంజాయి పట్టివేత

Post a Comment

కొత్తది పాతది