వట్టి వాగు ప్రాజెక్టును పరిశీలించిన ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు - ఆర్కే దొర

 



కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 కరకగూడెం మండల కేంద్రంలోని రేగుళ్ల గ్రామ సమీపాన నిర్మిస్తున్నటువంటి వట్టి వాగు ప్రాజెక్టును గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు గొగ్గలి ఆర్కే దొర సందర్శించారు.

 ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతున్నాయని తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం పెంచాలని అధికారులను కోరారు.

 తర్వాత స్థానిక రైతులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే రాబోయే రోజులలో బీడు బారిన భూములు సస్యశ్యామలం అవుతాయని రైతులకు వివరించారు. 

ఈ కార్యక్రమంలో గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షులు కొమరం శ్రీను, కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి గొగ్గలి కృష్ణ, ఉపాధ్యక్షులు గొగ్గలి సతీష్ మరియు స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది