అశ్వరావుపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి సతీష్ గౌడ్
తిరుమలకుంట గ్రామానికి చెందిన పేద గిరిజన విద్యార్థిని తల్లి వేడుకోలు...
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే. జీవితానికి మొదటి మెట్టని, ఉన్నత చదువులకు అసలైన పునాది అని భావించి.. పొద్దూమాపు పుస్తకాలతో కుస్తీ పట్టింది.. పుట్టింది పూరి గుడిసెలో అయినా చదువులో మాత్రం ఫస్ట్ క్లాస్..అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామానికి చెందిన సోడెం సోమరాజు (లేటు), లక్ష్మి దంపతుల కుమార్తె పేద గిరిజన విద్యార్థిని సోడెం వెంకటరమణ కష్టపడి పదో తరగతి ఫలితాల్లో 525 /600 మార్కులు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని వెంకటరమణ ను సన్మానించి అభినందించారు. దమ్మపేట మండలం, అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదివిన విద్యార్థిని..తరగతి గదిలో పాఠాలు వినడంతో పాటు, సొంతంగా నోట్స్ రాసుకున్నట్లు చెప్పుకొచ్చింది. రోజూ సబ్జెక్టుల వారీగా సాధన చేసినట్లు వివరించింది..తండ్రి సోడెం సోమరాజు అనారోగ్యంతో చనిపోయాడు, తల్లి రోజువారీ కూలి దీంతో తల్లి ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమయ్యేలా ఉంది. దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా సాయం అందించాలని విద్యార్థిని తల్లి వేడుకుంటోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి