భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఒరిస్సా మల్కాన్ గిరి జిల్లా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో అనుమానం వచ్చినటువంటి కారును నిలిపి లోపల పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
గంజాయిని బయటకు తీసి తూకం వేయగా29 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు భద్రాచలం సిఐ రహీం ఉన్నిసా బేగం తెలిపారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 14 లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ కేసులో కడపకు చెందిన సాయి కృష్ణ, పవన్ రెడ్డి, హైదరాబాదుకు చెందిన శ్రీహరి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
గంజాయితో పాటు కారును కూడా సీజ్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు.
గంజాయిని పట్టుకున్న కేసులో
అసిస్టెంట్ కమిషనర్ కరంచంద్ సీఐ రహీం మున్నీసా బేగం సిబ్బంది ఉన్నారు.
గంజాయిని పట్టుకున్నటువంటి భద్రాచలం పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యలు అభినందించారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://www.encounterbulletnews.in/#google_vignette
ఇది కూడా చదవండి...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... పోలీసుల ఎదుట లోంగిపోయిన మావోయిస్టు సభ్యులు
వణికిపోతున్న పాకిస్తాన్.. అజ్ఞాతంలో ప్రధాని..
కామెంట్‌ను పోస్ట్ చేయండి