భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా యువకులు అతి వేగంతో బైకులు నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని భద్రాచలం ఆర్టీవో వెంకట పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బైక్ ప్రమాదాలతో 70% మరణిస్తున్నారు. టూవీలర్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి సూచించారు.
ట్రాఫిక్ రూల్స్ వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని వెల్లడించారు.
కుర్ర కారు బైక్ పై అటు ఇటు తిరగాలని ఉత్సాహంతో ఎంతోమంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులు కూడా యువత విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి