11 సంవత్సరాలుగా గోదారి ఇసుకను తరలిస్తున్న బడా వ్యాపారి
టిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనదే ఇసుక
కోటి 30 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక పర్మిషన్లు ఎవరికోసం.?
మణుగూరు మండల కార్యదర్శి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ :-
మండలంలోని సాంబాయిగూడెం, తిర్లాపురం, చిక్కుడుగుంట, రామానుంజవరం, అన్నారం, కమలాపురం, చిన్నరాయిగూడెం గ్రామాల్లో గిరిజన సొసైటీలకు కేటాయించిన ఇసుక క్వారీలను 11 సంవత్సరాల నుంచి బడా కాంట్రాక్టర్ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ బడా కాంట్రాక్టర్ గత ప్రభుత్వంలోను ఆయనదే పైచేయి ఈ ప్రభుత్వంలో కూడా ఆయనదే పైచేయి సహజ వనరులైన ఇసుక, గ్రావెల్ మణుగూరు మండలంలో ఉన్న ప్రతిదాన్ని టోకెన్ గా తోడేసుకుంటున్న బడా వ్యాపారిపై ఒక్కటంటే ఒక చర్యలు తీసుకున్న పాపాన పోలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. మణుగూరు మండలంలో కోటి 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక పర్మిషన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోట్లల్లో వ్యాపారం సాగటానికి మణుగూరు ప్రాంతం నిలయంగా మారిందని దీన్ని అధికార పార్టీలో ఒక నాయకుడు అండ ఇంత పెద్ద తప్పిదాన్నికి ఎలా పర్మిషన్లు ఇస్తారని ప్రశ్నించారు. ఇసుక తోడుకోవడానికి పర్మిషన్ ఒక్క దగ్గరైతే ఇంకొక దగ్గర తోడుతున్నారు. మనుషుల తోటి తీయాల్సింది యంత్రాల తోటి తీస్తా ఉన్నారు. గోదావరి మధ్యలో పెద్ద పెద్ద జెసిబిలతో తొడుతుంటే అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని అధికారులకు ముడుపులు, కావాల్సిన వాళ్లకు కమిషన్లు, మణుగూరులో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11 సంవత్సరాల నుంచి చేస్తున్న సొసైటీ ర్యాంపులు మరియు. పట్టా భూముల్లో తీసినటువంటి ఇసుకపై బడా కాంట్రాక్టర్ ర్యాంపులపై విచారణ చేయించి ఆదివాసీలను అడ్డం పెట్టుకొని సొసైటీలను మొత్తాన్ని గుండు గుత్తగా కొనుక్కొని ఇటు గిరిజనులను అటు ప్రభుత్వాలను మోసం చేస్తూ కోట్లలో వ్యాపారం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూపించి ప్రజలపై విరుచుకుపడుతున్న అధికారులు ఇటువంటి బడా వ్యాపారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎన్నో పత్రికలలో వ్యాసాలు ఎన్నో టీవీలలో సహజ వనరులు దోచుకొని పోతున్నారని పదేపదే చెప్పినా ప్రభుత్వం, కోటి 30 లక్షల కుబిట్ మీటర్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అన్నదే ప్రశ్న. ఇప్పటికైనా ప్రజలు ప్రజాప్రతినిధులు మేధావి వర్గాలు ఆలోచించి రానున్న ముప్పును మన ప్రాంతంలో పసిగట్టి ఈ పర్మిషన్లు తక్షణమే రద్దు చేయాలని గిరిజన సొసైటీలకు వారి అంతట వారు స్వేచ్ఛగా ఇసుక వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మణుగూరు బడా వ్యాపారిపై తక్షణమే చర్యలు తీసుకొని సహజ వనరులు ఒకటైన ఇసుక ఎర్రమట్టిని కాపాడాలని లేని పక్షంలో రానున్న కాలంలో గోదావరి ముప్పు విపరీతంగా మన ప్రాంతానికి ఉంటుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి.. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులు
బిగ్ బ్రేకింగ్... మెరిసిన పేదింటి విద్య కుసుమం..
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్...స్వయంగా కలెక్టర్ సరే పార,గునపం చేతపట్టి.......
...ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... లారీలో పట్టుబడిన 30 కేజీల గంజాయి..
إرسال تعليق