పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్లో మంగళవారం వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యంలో పహల్గం ఉగ్ర దాడి ని ఖండిస్తూ... కొవ్వొత్తులతో నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకి తగిన న్యాయం జరిగే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రులందరూ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఉగ్రవాదులు కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నారు. మతాలు అడిగిమరీ చంపడం అనేది దుర్మార్గమైన చర్యని ఖండించానన్నారు. వీలైనంత త్వరలో ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలని కోరారు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గం లో 24 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. ఉగ్రవాద మత. దేశాన్ని తరిమికొట్టాలున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, సురేష్, రవి , త్రిమూర్తులు, ప్రవీణ్, రాజశేఖర్, కమలాకర్ చరణ్ వేణు లక్ష్మణ్, సాంబయ్య వేణు చారి, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి