మణుగూరు,ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సీఎం రేవంత్ రెడ్డి కి నియోజకవర్గం లో త్వరగా అర్హులను గుర్తించి సహకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలిపిన.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
రేషన్ కార్డు లబ్ధిదారుడికి నూతన రేషన్ కార్డును అందజేసిన...మండల అధ్యక్షులు పీరనాకి నవీన్
ఈరోజు మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రేషన్ కార్డు లబ్ధిదారుడికి నూతన రేషన్ కార్డును అందజేసిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్..ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పది ఏళ్ల నుండి నిరుపేద కుటుంబాలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు అన్నారు.పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా రేషన్ కార్డు అందజేయని ఘనత ఆనాటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ ది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద మరియు మహిళా ప్రభుత్వం అని మరి ఒకసారి నిరూపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేయడమైనది..ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాండ్ల సురేష్, మైనార్టీనాయకులు ఎండి రహీంపాషా నాయకులు ,అప్పన నరేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి... ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... పినపాక: ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డుల పై సర్వే నిర్వహించిన అధికారులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి