ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: మణుగూరు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నూతన కమిటీని పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకొన్నారు. సింగరేణి ఏరియాలో బి ఆర్ ఎస్ ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమాలపై బి ఆర్ ఎస్ కార్మికుల పక్షాన ఉంటూ వారి బాగోగులు చూసుకోవడంలో బి ఆర్ ఎస్ ఓబి కాంట్రాక్ట్ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా గడదేసి మధుబాబు, సెక్రటరీగా మా దేవి అశోక్, వైస్ ప్రెసిడెంట్ గా జాల నాగరాజు, కోశాధికారిగా ఎర్రోజు రాము ను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇంకా నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి