TG:ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
రాయితీ పోను మిగతా వాటా భరించేందుకు లబ్దిదారు సిద్ధంగా ఉన్నా యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయించింది.
క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత అర్హుల జాబితాను బ్యాంకర్లకు పంపించి, ఆ యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేయాలని సూచించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందా అని నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.
ఈ లోన్ అంతే ఎంతోమంది నిరుద్యోగులకు ఆసరాగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి....సస్పెండ్ చేయించాడు అనే ఆక్రోషంతో యువకుడి హత్య
కామెంట్‌ను పోస్ట్ చేయండి