నారాయణపూర్- కొండగావ్ అడవుల్లో ఎన్ కౌంటర్?

 



చత్తీస్గడ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ - కొండగావ్ అడవుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది...


నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావో యిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది, దీంతో భద్రత సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

కూంబింగ్ చేపడుతున్న భద్రత బలగాలపై మావో యిస్టులు కూడా ఎదురు కాల్పులకు దిగటంతో.. ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లి పోయింది. అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయని బస్తర్ ఐజి సుందరరాజ్ తెలిపారు. 


ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది