అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వేసవి సెలవులకు ఉళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి చోరీలకు అడ్డుకట్ట వేయండి
పోలీసులతో సహకరించి అశ్వాపురం పోలీసులు చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి...
👉🏽 సీ ఐ జి. అశోక్ రెడ్డి
అశ్వాపురం: సెలవులు వచ్చేసాయి ఊరు వెళ్తున్నారా... మరి ఇల్లు జాగ్రత్త... సెలవుల కోసం కుటుంబాలే కాదు దొంగలు కూడా ఎదురు చూస్తుంటారు... వేసవిలో పిల్లలు, పెద్దలు, కలిసి సరదాగా పర్యటన ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు బంధువుల ఇండ్లకు వెళితే దొంగలు తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేస్తున్నారు
మీ ఇంటికి తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చని సీ ఐ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదని, లోపలి నుండి గొళ్ళెం పెట్టాలని, ఇంటిలోపల, బయట లైటు వేసి వుంచాలని పేర్కొన్నారు.
ప్రజలు, పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించగలమని స్పష్టం చేశారు. ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు .ఎవరైన మీ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే డయల్ 100 కు గాని స్థానిక పోలీస్ స్టేషన్ కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు అని సిఐ సూచించారు...
ఇది కూడా చదవండి... ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... లారీలో పట్టుబడిన 30 కేజీల గంజాయి..
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ లో పనిచేయుటకు మండలాల వారీగా విలేకర్లు కావలెను
ఐడి కార్డు కు ఎలాంటి పేమెంట్ చెల్లించాల్సిన పని లేదు.
ఆసక్తి కలవారు సంప్రదించండి: 8886774046
కాళీ ఉన్న మండలాలు....
మణుగూరు
అశ్వాపురం
బూర్గంపాడు
భద్రాచలం
కామెంట్‌ను పోస్ట్ చేయండి