మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
- పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
- దాడిని నిరసిస్తూ ముస్లింల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ
పినపాక నియోజకవర్గ ప్రతినిధి( V10 న్యూస్ ) ఏప్రిల్ 28:
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ మణుగూరు మండల కేంద్రం లో ముస్లిం మిల్లత్ కమిటీ సోదరి,సోదరీమణులు సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీ సురక్ష బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు చనిపోయిన వారికి నివాళులర్పించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ గొంతెత్తి.. నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చాటుతుందని కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉంటున్నామన్నారు. దేశంలో మతసామరస్యాన్ని చూసి ఓర్వలేక ఉగ్రముకలు పాశావికంగా కాల్పులు జరపడం పిరికిపంద చర్య అన్నారు. ఇస్లాం అంటేనే శాంతి అని ఇస్లాంలో హింసకు తావు లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు, దాడులు చేసిన దేశంలో మతసామరస్యాన్ని విడదీయ లేదన్నారు. ఇలాంటి ఘటనాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శాంతి ర్యాలీలో... ముస్తఫా, నూరుద్దీన్, ఎక్సలెంట్ యూసఫ్, సిరాజ్, రఫీ ఉమర్, కుద్దూస్ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ పినపాక ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డుల పై సర్వే నిర్వహించిన అధికారులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి