పినపాక: 70 క్వింటాల మిర్చి దగ్ధం... 12 లక్షల ఆస్తి నష్టం

  



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, 

పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పొనగంటి పురుషోత్తం     పొలంలో ఉన్న 70 క్వింటాల మిర్చి కి గుర్తు తెలియని వ్యక్తులు  నిప్పంటించారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా   విలపించారనే చెప్పాలి. లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లడంతో వారి దిగ్భ్రాంతికి లోనయ్యారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.12 లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


Post a Comment

కొత్తది పాతది