ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
అశ్వాపురం : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఐ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
సోమవారం ఆయన తన సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి, వాహనాల పత్రాలను పరిశీలించారు
తాగి వాహ నాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.రాంగ్ రూట్లో ప్రయాణాలు నేరమని , వాహనదారులు రాంగ్ రూట్లో దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు, వాహనాలు నడిపేటప్పుడు మెల్లగా వెళ్లాలని, అతి వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడిన కుటుంబ పరంగా,ఆర్థికపరంగా నష్టపోతారని అన్నారు , వాహనాలు జాగ్రత్త
గా నడిపి గమ్యం చేరుకోవాలని వాహనదారులకు సూచించారు.
ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి