పినపాక: నీళ్ల సదుపాయం లేక విద్యార్థుల అవస్థలు


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తాగేందుకు మంచినీల్లు దొరకని దుస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి చదివి విద్యార్థులు ఉన్నారు. గత కొంతకాలంగా చేతిపంపు పని చేయకపోవడంతో విద్యార్థులు నీళ్లు తాగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అంతేగాకుండా వంట చేయడానికి సైతం నీళ్లులేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. పురాతన కాలంగా గ్రామస్తులు పాఠశాల విద్యార్థులకు ఈ ఒక్క పంపు మాత్రమే జీవజల్లంగా దాహార్తిని తీరుస్తుంది.  మండల విద్యాధికారి, ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు చొరవ చూపి తక్షణమే చేతి పంపును రిపేర్ చేసి వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు విద్యార్థులు కోరుతున్నారు.


Post a Comment

కొత్తది పాతది