ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావు పేటకు చెందిన పొనగంటి పురుషోత్తం అనే రైతు అప్పులు చేసి ఆరుకాలం కష్టపడి, సాగు చేసిన మిర్చి పంటకు నిప్పు పెట్టి, బూడిద పాలు చేసిన నిందితులను పట్టుకోవాలని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
బాధితుడు మాట్లాడుతూ.. 10 ఎకరాలలో మిర్చి సాగు చేస్తున్నానని, 6 ఎకరాలలో వచ్చిన 70 క్వింటాల పంటను మంగళవారం నాడు మార్కెట్లో అమ్ముకుందామని ఆరబెట్టిన మిరపకాయలను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారని తన ఆవేదనను వ్యక్తం చేశాడు, అర్ధరాత్రి సమయంలో తనతోపాటు చుట్టుపక్కనున్న రైతులు, ప్రజలు మిర్చికి అంటుకున్న మంటను అదుపు చేయడానికి చాలా కష్టపడ్డారని, కానీ మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో లాభం లేకుండా పోయిందని అన్నారు, ప్రభుత్వం తమకు జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని తగినంత నష్టపరిహారం ఇప్పించాలని కోరారు, ఈ ఘటనపై స్థానిక ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశానని అన్నారు, ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ షేర్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి