ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి 14 రోజున పుల్వామ లో CRPF సైనికులు కాన్వాయ్ లో వెళుతుండగా... జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో కాన్వాయ్ ని ఢీకొన్నాడు. పెద్ద పేలుడు సంబంధించి కాన్వాయ్ తునా తునాకలుగా తేలిపోయింది. ఈ ఘటనలో 40 మంది CRPF సైనికులు మరణించారు. ఈ ఘటనతో భారతదేశానికి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిచర్యలకు దారితీసింది.
ప్రతి సంవత్సరం, ప్రాణాలు కోల్పోయిన ధైర్య సైనికులను గౌరవించుకోవడానికి భారతీయులు ఈ రోజును గుర్తుంచుకుంటారు.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై బాలకోట్ వైమానిక దాడితో సహా భారతదేశంలో బలమైన చర్యలకు దారితీసింది.
సైనికుడు అవ్వాలనే ప్రతీ ఒక్కరూ.. దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే లక్ష్యంతో వెళతారు.
ప్రాణాలకు తెగించి, కుటుంబానికి దూరంగా ఉంటూ... ఆయుధం చేతపట్టి మనకోసం జీవిస్తున్న సైనికులకు సెల్యూట్.
జై జవాన్.
#Black day #pulwama attack #February 14
కామెంట్‌ను పోస్ట్ చేయండి