ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గణతంత్ర దినోత్సవం రోజున పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ దుర్గా భవాని నేతృత్వం లో సాధారణ ప్రసవం
26వ తేదీ ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ దుర్గా భవాని నేతృత్వం లో ఏల్చీరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కె. రమ్య కృష్ణ కి ఉదయం 8గం 50 నిమిషాలకు సాధారణ ప్రసవం చేశారు. పుట్టిన పాప 2కేజీల 600 గ్రాముల బరువు ఉన్నదని ఆమె తెలిపారు.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజు బిడ్డ పుట్టిన సందర్భంగా బేబీ తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఈ సందర్భంగా డాక్టర్ దుర్గ భవానికి పాప తల్లి దండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా భవాని, నర్సింగ్ ఆఫీసర్ భవాని, ఆశ, సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి