పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అత్యవసర సేవలు అందించినందుకు గాను ప్రశంసా పత్రం అందుకున్న మునిగెల నాగరాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం రావిగూడెం గ్రామానికి చెందిన మునిగెల నాగరాజు అత్యవసర సమయంలో సేవలందించినందున ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సయ్యద్ ముక్సుద్ ముహుద్దిన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. కాగా నాలుగు రోజుల క్రితం మణుగూరు మండలం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద డీసీఎం వ్యాన్ ఈ బయ్యారం బీట్ ఆఫీసర్ సాంబయ్యను ఢీ కొట్టిన సమయంలో నాగరాజు ఘటనా స్థలంలో ఉన్నారు. నాగరాజు వెంటనే స్పందించి గాయాలైన బీట్ ఆఫీసర్ పట్టుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి, అత్యవసర సేవలు అందించినందున నాగరాజుకు ప్రశంసా పత్రం అందింది. ఈ సందర్భంగా పలువురు నాగరాజుకి అభినందనలు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి