ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరుకై దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. నిర్దేశము 3 లొ ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా, కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు మరియు విధానాలను పరిశీలించడానికి మరియు సిఫార్సు చేయడానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసింది, దీనిని మంత్రి మండలి 04.01. 2025 న ఆమోదించింది.
నిశితంగా పరిశీలించిన తర్వాత, పైన ఉదహరించిన నిర్దేశము 1 మరియు 2 లో జారీ చేసిన అర్హత ప్రమాణాల ఉత్తర్వుల ప్రకారం, కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది.
కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు:
1. కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు/ GHMC కమిషనర్ కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడును.
2. మండల స్థాయిలో ఎంపిడిఓ / ULBలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు.
3. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) / DCSO పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
4. ముసాయిదా జాబితాను గ్రామసభ మరియు వార్డు సభ లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తరువాత ఆమోదిస్తారు.
5. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్దిదారుల అర్హత జాబితాను మండల / మున్సిపల్ స్థాయి లో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ /GHMC కమీషనర్ లాగిన్ కు పంపాలి.
6. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్/ GHMC కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్(CCS) లాగిన్ కి పంపాలి.
7. ఇట్టి పైనల్ లిస్ట్ ప్రకారం, CCS కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
8. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులొ ఉండేలా చర్యలు తీసుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి