ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్: చెరువు సింగారం సీతారాం ప్రాజెక్ట్ కాలువ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది...
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ పోలీసులు పేకాట స్థావరం పై దాడి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం, చెరువు సింగారం గ్రామ శివారు సీతారామ ప్రాజెక్ట్ కాల్వ సమీపం లో అటవీ ప్రాంతం లో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్లు ఆరు సెల్ ఫోన్లు మూడు బైకులు సీజ్ చేసి బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.
బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను వారి నుంచి 18 వేల 50 రూపాయలు మూడు ద్విచక్ర వాహనాలు 6 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవటం జరిగింది, అలాగే పట్టుబడ్డ ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయటం జరిగిందని ఎస్ఐ రాజేష్ తెలిపారు. యువత చెడు మార్గాలకి అలవాటు పడకుండా ఉన్నతమైన విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా ఉండాలని యువతకు సందేశం ఇచ్చారు ఎస్ఐ రాజేష్.
బూర్గంపాడు మండలంలో ఎక్కడైనా పేకాట కోడిపందాలు అక్రమంగా గంజాయి రవాణా మరె ఇతరత్రా చట్ట విరుద్ధమైన పనులు చేస్తే బూర్గంపాడు పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ తెలిపారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి