ఏసీబీ వలలో అవినీతి పోలీస్ అధికారి
ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమైండ్ కు తరలించనున్నట్ట వెల్లడించిన ఏసీబీ డిఎస్పి సాంబయ్య
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
తొర్రూరు పొలిస్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్ రెండు నెలల క్రితం పి డి ఎస్ బియ్యం లారీని పట్టుకొని లారి యజమాని నుండి 5 ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి 2 లక్షల లంచం తీసుకున్నాడని ఎసిబి అధికారులకు ఇచ్చిన పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి సీ ఐ కే జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ సందర్బంగా ఏసీబీ డి ఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు నెలల క్రితం పిడిఎస్ బియ్యం లారీని పట్టుకోవడం జరిగిందని, బియ్యం లారీ యజమాని నుండి ఐదు లక్షల రూపాయలను తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్ డిమాండ్ చేసి 2024 అక్టోబర్ 3 తేదీన 2 లక్షల రూపాయల నగదును తీసుకోవడం జరిగిందని, మిగతా మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని, లారీ యజమాని వేధించగా వరంగల్ లో ఉన్నఏసీబీ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, పై అధికారుల సూచనల మేరకు తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ పై కేసు నమోదు చేయడం జరిగిందని, డబ్బులు డిమాండ్ చేసినట్లుగా పూర్తి వీడియోలను రికార్డింగ్లను స్వాధీనం చేసుకుని గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల ముందు వీడియో రికార్డింగ్లను పూర్తిగా వారి ముందు ప్రవేశపెట్టి సీఐ జగదీష్ ను సోమవారం తొర్రూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ కస్టడీ కి తీసుకోవడం జరిగిందని, ఆయన తెలిపారు. ఇతడిని వరంగల్ ఏసీబీ స్టేషన్ కు తరలించి మంగళవారం ఉదయం ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్నట్లుగా తెలిపారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి