ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గురుకులాల ప్రిన్సిపల్స్, సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది
ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం
గురుకులల్లో పదేళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం
పిల్లలే ఈ దేశ భవిష్యత్తు.. వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో.. అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ గారు చెప్పేవారు
దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉంది
కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు
తామున్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు బ్రమలు కల్పిస్తున్నారు
హాస్టల్ జీవితం చాలా అద్భుతం.. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను
నేను నిత్య విద్యార్థిని.. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ పూర్తి చేశాను
మరో పిజి కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాను
హాస్టల్ జీవితం ఆనందదాయకం
హాస్టల్లో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలి
మీరు విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
విద్యార్థులను సంరక్షించేందుకు ప్రభుత్వం నుంచి మీరు వేతనాలు అందుకుంటున్నారు
పిల్లలను ప్రయోజకులను చేయడం మీ మీద ఉంది
పరీక్షల్లో మంచి ఫలితాలను ఇవ్వగలిగారు
కొన్ని చోట్ల కలుషిత ఆహార ఘటనలు వెలుగుచూస్తున్నాయి
కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు దురదృష్టకర ఘటనల మీద రాజకీయం చేస్తున్నాయి
అసలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు సోషల్ మీడియాలో పెట్టి విష ప్రచారం చేస్తున్నారు
నిజం కడప దాటకముందు అబద్ధం ఊర్లు చుట్టి వస్తుంది
విద్యకు మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుంది
అందుకే మెస్ చార్జీలను పెంచాము
మెను పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి
సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పోషకాహారాన్ని అందజేయాలి
కొందరు టీచర్ల ఇర్షా, ఆసూయలతో ఆదిపత్య పోరులో కొన్ని హాస్టల్లో ఇబ్బందులు వస్తున్నాయి
అంతా ఒక కుటుంబంలో వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు
మా ప్రభుత్వం టీచర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
అత్యున్నత విద్యా వ్యవస్థను పెంపొందించేలా చర్యలు తీసుకునామ్
ఐఏఎస్ లో గురుకులాల్లో నిద్ర చేసేలా చర్యలు చేపట్టాము
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుంది
మీరు విద్యను పంచడం ద్వారా లక్షలమంది ప్రయోజకులై ఈ దేశ నిర్మాణంలో భాగం పంచుకుంటారు
పేరెంట్స్ తర్వాత ప్రిన్సిపల్సే పిల్లల బాధ్యత తీసుకోవాలి
మానవత్వాన్ని మేలవించి బోధిస్తే విద్యార్థులు సక్సెస్ అవుతారు
హాస్టల్ చిన్నారులపై చిన్న చూపు ఉంది
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు విద్యా హక్కును ప్రసాదించారు
బయట లక్షలు పెట్టిన కొనలేని విద్యను గురుకులాల్లో మన ప్రభుత్వ అందిస్తుంది
మీ విద్యార్థుల విజయాలే మీ పని తీరుకు అద్దం పడుతుంది
టీచర్ల ప్రభావం విద్యార్థుల మీద అధికంగా ఉంటుంది
మీరు విద్య బుద్ధులు నేర్పిన పిల్లలు ఉన్నత ఉద్యోగాలు పొందితే.. అది మీ విజయమే
*హాస్టల్లో చదివి ఎదిగిన బిడ్డను కాబట్టి.. గురుకుల హాస్టల్ లపై నాకు ప్రత్యేక మమకారం ఉంది*
సీఎం ఆదేశానుసారం హాస్టలను సందర్శిస్తున్నాను
ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు పదోన్నతులు పూర్తి చేసాము
సకాలంలో జీతాలు ఇస్తున్నాము
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డే గా ప్రకటించి మహిళా టీచర్ల గౌరవాన్ని పెంచాము
మహిళా టీచర్ల విజ్ఞప్తిని సీఎం గారికి నివేదిస్తే.. వెను వెంటనే జీవో జారీ చేశారు
గురుకుల టీచర్లు, ప్రిన్సిపల్ల వత్తిడి నాకు తెలుసు
రాజకీయ కారణాలతో చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది
స్నేహపూర్వక వాతావరణం లో పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలి
దండనతో కాకుండా ఆప్యాయతగ పిల్లలతో మెలగాలి
పేదింటి బిడ్డలను విజయపతాన నిలపాల్సింది మీరే
డాక్టర్ అంబేద్కర్ గారు అవమానాలను అధిగమించి ఐకాన్ అఫ్ నాలెడ్జిగా ఎదిగారు
ఆయన స్ఫూర్తిగా అనగారీన వర్గాలు
అక్షర జ్ఞానాన్ని పెంచుకొవాలి
మన ఎదుగుదలను ఓర్వలేక సమాజంలో, సోషల్ మీడియాలో మన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తారు
అయినా బెదరకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి
కొన్ని దుష్టశక్తులు బహిరంగంగా టీచర్లను అవమానిస్తున్నారు
చేసే చిన్న చిన్న తప్పులకు బహిరంగంగా శిక్షలు విధిస్తున్నారు
టీచర్లతో విద్యార్థుల కాళ్లు మొక్కించడం ఏం సంస్కృతి
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులు అంతా ఏకమై ఖండించాలి
కలుషిత ఆహార ఘటనలపై ప్రభుత్వ సీరియస్ గా ఉంది
అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది
ప్రభుత్వంలో టీచర్లు కూడా భాగస్వాములే
జ్ఞానం అనేది తరగని గని
తెలిసింది కొంతే.. తెలుసుకోవాల్సింది ఎంతో
అందుకే టీచర్లు నిత్య విద్యార్థులా జ్ఞానాన్ని పెంచుకోవాలి
అన్ని దానాల్లో కెల్ల విద్యదానం గొప్పది
విద్యార్థులను వజ్రాలుగా తీర్చిదిద్దాలి
గురుకులల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పిల్లల జీవితాలతో చెలగాటలొద్దు


కామెంట్‌ను పోస్ట్ చేయండి