పందెం రాయుళ్లకు ఎస్ఐ రాజ్ కుమార్ హెచ్చరిక...
-సంక్రాంతి పేరుతో కోడి పందెం ఆడితే కఠిన చర్యలు.....
_ఇ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్
- పినపాక , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్సై ఇ. రాజ్ కుమార్ సోమవారం పినపాక మండల ప్రజలకు ఒక ప్రకటనలో భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు కోడి పందెం లను ఉద్దేశించి మాట్లాడుతూ మండల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కోడిపందాలు ఆడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పందెపు రాయుళ్లను ప్రత్యేకమైన ఫోర్స్ తో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.పేకాట కోడిపందాలు ఎవరైనా ఆడుతున్నట్లయితే తమకు సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్.ఐ రాజ్ కుమార్ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి