పీపుల్స్ డైరీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరక గూడెం, జనవరి 08 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం సమీక్ష సమావేశంలో భాగంగ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదగా పీపుల్స్ డైరీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం న్యూస్ రిపోర్టర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా "పీపుల్స్ డైరీ " పత్రిక రంగం లో ప్రత్యెక స్థానం ఏర్పర్చుకున్నదని అన్నారు. పీపుల్స్ డైరీ అనాతి కాలం లోనే గొప్ప ప్రజాదరణ పొందగలిగిందని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, తహసిల్దార్ నాగ ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి మంజుల, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, సమత్ భట్టుపల్లి మాజీ సర్పంచ్ పొలెబోయిన శ్రీవాణి , తిరుపతయ్య, భట్టుపల్లి మాజీ సర్పంచ్ తొలేం నాగేశ్వర రావు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యర్రా సురేష్, భూక్యా రాందాస్,విలేకరులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి