గ్రామ పంచాయతీ కార్యదర్శుల కష్టాలు వినేది ఎవరు....

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



• గ్రామాలలో అన్ని పనులు చేసిన కుటుంబం గడవని దుస్థితి



పేరుకే ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తున్నది ఎట్టి చాకిరి లానే ఉందని పనికి తగిన వేతనం అందడం లేదని గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యం పనుల నుంచి బిల్లుల వసూలు, మంచినీటి సరఫరా , విద్యుత్ దీపాల ఏర్పాటు, మొక్కల పెంపకం, స్థానిక పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టే రకరకాల పథకాలకు ఇంటింట సర్వే మొదలగు అనేక కార్యక్రమాలకు కార్యదర్శులు మూలం. కార్యదర్శిలు ఎంత కష్టపడినా చాలీచాలని జీతం అది కాస్త నెల నెల రాకపోవడంతో సహచరులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. పంచాయతీలలో అభివృద్ధి పనులు చేయించడానికి నిధులు ఇక పోవడంతో అప్పులు చేసి పంచాయతీ పనులు చేయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా నిధులు రావడంతో అవమానాలకు సైతం గురికావాల్సిన పరిస్థితి నెలకొందని కొంతమంది కార్యదర్శులు బాహాటంగానే అమ్మ గోడును వెల్లబోస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులకు సైతం నెలవారి జీతం ఇవ్వలేక పోతున్నామని పనులు చెప్పే అధికారం కూడా లేకుండా పోతుందని , ప్రతీరోజు పని వత్తిడి ఉన్నందున ఆదివారాల్లో సైతం విధులకు హాజరు కావలసి వస్తుందని వాపోతున్నారు. నైనా జిల్లా ఉన్నత అధికారులు , పంచాయతీరాజ్ శాఖ మంత్రి కలుగ జేసుకోవాలని వేడుకుంటున్నారు

Post a Comment

కొత్తది పాతది