హన్మకొండ లో పట్టపగలు దారుణ హత్య
హనుమకొండ నగరంలో దారుణం జరిగింది. పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి గుర్తుతెలియని వ్యక్తులు కారులో పెట్టి పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి వెలుగట్టి రాజా మోహన్ గా గుర్తించారు. పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి