ఉత్సాహంగా కొనసాగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలు
- క్రీడలను ప్రారంభించిన ఎంపీడీవో దేవ వర కుమార్, మండల విద్యా శాఖ అధికారి గడ్డం మంజుల
కరక గూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రారంభించిందని ఇన్చార్జి ఎంపీడీవో దేవ వర కుమార్, మండల విద్యాశాఖ అధికారి గడ్డం మంజుల తో కలిసి మండలంలో చిరుమళ్ళ, పంచాయతీ , వెంకట పురం గ్రామ పంచాయతీ ల మధ్య కబడ్డీ క్రీడలను ప్రారంభించారు.. అనంతరం ఎంపీడీవో దేవ వర కుమార్ మాట్లాడుతూ
గ్రామస్థాయిలో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 10,11,12 మండలస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేసి జిల్లాస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు మండల స్థాయిలో ప్రతిభచాటే క్రీడాకారులను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారన్నారు.. జిల్లాస్థాయిలో 20 క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించి అక్కడ ప్రతిభ చాటే క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మండల విద్యా శాఖ అధికారి గడ్డం మంజుల, వివిధ గ్రామపంచాయతీ సెక్రటరీలు, ఆర్ఐ లు హుస్సేన్, కృష్ణ ప్రసాద్, పి ఈ టి లు, కొమర0 కాంతారావు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి