పినపాక ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
బాధిత రైతులకు మద్దతుగా బొల్లోజు అయోధ్య...
పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద సన్న కారు రైతుల వద్ద నుండి నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో 126.07 ఎకరాల భూమిని అక్రమించుకుంటున్నట్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం హెచ్చరిక బోర్డులు పెట్టడం ఎవరు జీర్ణించుకోలేని విషయం అని సిపిఐ పార్టీ నాయకులు బొల్లోజు అయోధ్య అన్నారు. గత నాలుగు రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళవారం గోపాలరావుపేట గ్రామాన్ని సందర్శించిన ఆయన రైతుల బాధలు తెలుసుకొని అండగా ఉంటానని తెలిపారు. రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని ఉన్నారు.126 ఎకరాలు సాగులో ఉన్న వరి పొలాన్ని స్వాధీన పరచుకోవడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మంది రైతులు రోడ్డున పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆలోచన చేసి అశ్వాపురం మండలంలో నవోదయ విద్యాలయాన్ని కేటాయించే విధంగా ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు దృష్టి కి వెళ్తారని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి